




గొప్ప యజమానుల కోసం 2025 (10 రవ వార్షిక) స్టీవ్ అవార్డులకు నామినేషన్లు సమర్పించడానికి మేము మీ సంస్థను ఆహ్వానిస్తున్నాము. ఇది మానవ వనరుల విజయాలు, బృందాలు మరియు నిపుణులు మరియు కొత్త ఉత్పత్తులు మరియు సేవలు మరియు పని చేయడానికి గొప్ప ప్రదేశాలను సృష్టించి సహాయపడే సరఫరాదారుల కొరకు అందించే ప్రపంచంలోని అత్యున్నత గౌరవం.
మీరు నామినేషన్లను ఎలా తయారు చేయాలి మరియు వాటిని ఎలా సమర్పించాలి అనే దాని గురించి పూర్తి సూచనలను కలిగి ఉన్న ఎంట్రీ కిట్‌ను స్వీకరించాలనుకుంటే, మీ ఈ-మెయిల్ చిరునామాను ఇక్కడ సమర్పించండి మరియు మేము మీకు ఈ-మెయిల్ ద్వారా పంపుతాము. మేము చాలా కఠినమైన గోప్యతా విధానాన్ని పాటిస్తాము మరియు ఎటువంటి కారణం కొరకూ మీ ఈ-మెయిల్ చిరునామా ఎవ్వరికీ ఇవ్వబడదు.
మీరు ఈ వెబ్ సైట్ లో ఈ భాషలో చూసే ఏకైక పేజీ ఇది మాత్రమే. ఎంట్రీ కిట్ వలె అన్ని ఇతర పేజీలు ఆంగ్లంలో ఉన్నాయి. ఇందుకు కారణం, నామినేషన్లు మాకు ఆంగ్లంలో సమర్పించబడాలి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిపుణులు తీర్పు ప్రక్రియలో పాల్గొనవచ్చు. అవార్డుల యొక్క సంక్షిప్త వివరాలు, సబ్మిషన్ యొక్క అవసరాలు మరియు ఇందులో పాల్గొనడం వల్ల మీకు కలిగే ప్రయోజనాల గురించి క్రింద తెలుపబడ్డాయి. మీ సంస్థ ఈ అవార్డులకు నామినేషన్లను సమర్పించాలని నిర్ణయించినట్లయితే, మీ నామినేషన్లు తప్పనిసరిగా ఆంగ్లంలోనే తయారు చేయబడాలని గుర్తుంచుకోండి.
ప్రపంచంలోని ఉత్తమ మానవ వనరుల నిపుణులను మరియు యజమానులను గుర్తించే ఏకైక ప్రపంచ అవార్డు ఈ 'గొప్ప యజమానుల కోసం స్టీవ్ పురస్కారాలు(Stevie® Awards for Great Employers)'. పురస్కారాలను అందించే స్టీవ్ పురస్కారాల(Stevie® Awards) సంస్థ యునైటెడ్ స్టేట్స్ లోనే ఉంది. వారు ఎనిమిది వేర్వేరు స్టీవ్ పురస్కారాల(Stevie® Awards) పోటీల నిర్వాహకులు. మీరు www.StevieAwards.com లో వారి గురించి తెలుసుకోవచ్చు. స్టీవ్ పురస్కార(Stevie® Awards) ట్రోఫీ ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన బహుమతులలో ఒకటిగా మారింది.
2024 లో, గొప్ప యజమానుల కొరకు స్టీవ్ అవార్డులను 28 కి పైగా దేశాల సంస్థలకు మరియు వ్యక్తులకు లభించాయి. 2024 ఎడిషన్లో విజేతల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
గొప్ప యజమానుల కోసం స్టీవ్ పురస్కారాలలో(Stevie® Awards for Great Employers) ఎంచుకోవడానికి ఆరు రకాల పురస్కారాల వర్గాలు ఉన్నాయి. మీరు పాల్గొనాలని అనుకుంటే, మీ సంస్థ గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న విజయాలకు సరిపోయే వర్గాలను మీరు ఎన్నుకోవాలి మరియు ఆ వర్గాల సూచనల ప్రకారం మీ నామినేషన్లను సిద్ధం చేసుకోవాలి. అందుబాటులో ఉన్న వర్గాల రకాలు ఈ క్రిందివి:
వర్గాల జాబితా మరియు వివరణ ఎంట్రీ కిట్‌లో ఉన్నాయి.
ప్రతి వర్గాలలోని ప్రశ్నలకు వ్రాతపూర్వక సమాధానాలు లేదా ప్రశ్నలకు సమాధానమిచ్చే ఐదు (5) నిమిషాల పొడవు గల వీడియోను అందించే అవకాశం మీకు ఉంటుంది.
సంప్రదింపులు
స్టీవ్ అవార్డులకు(Stevie® Awards) చాలా దేశాలలో ప్రతినిధులు ఉన్నారు. మా ప్రతినిధులు సమాచారాన్ని పంపిణీ చేస్తారు మరియు దేశంలోని సంస్థలకు అవార్డులలో పాల్గొనడానికి సహాయం చేస్తారు.
మీ దేశంలో ఎవరైనా ప్రతినిధి ఉన్నారో లేరో తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు ఈ క్రింది చిరునామా ద్వారా కూడా నిర్వాహకులను సంప్రదించవచ్చు:
స్టీవ్ పురస్కారాలు(Stevie® Awards)
10560 మెయిన్ స్ట్రీట్, సూట్ 519
ఫెయిర్ఫాక్స్, వర్జీనియా 22030, యూ.ఎస్.ఏ.
ఫోన్: +1 703-547-8389
ఫ్యాక్స్: +1 703-991-2397
ఇమెయిల్: help@stevieawards.com
Share